హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్(JubileeHills Club)లో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం (Christian Spiritual Fellowship) సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Tpcc Chief Mahesh Kumar Goud), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar), రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (JubileeHills ByElection) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా ఈ క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.


