- భారత్‌లో మేధస్సుకు కొదవ లేదు..
- మన పురాణ పురుషుల గొప్పలు తెలుసుకోవాలి
- అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పది
- బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు యోధుడు
- ఇవన్నీ మన పిల్లలకు తెలియ చేయాలి
- తిరుపతి విజ్ఞాన్ సమ్మేళన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
భారత్‌లో మేధస్సుకు కొదవలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను (మొదటి పేజీ తరువాయి) ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్ప వారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు. కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు చంద్రబాబు.
శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు. కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు. అప్పుడే మన పిల్లలు మంచికి, చెడుకి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయా ల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించారన్నారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ గతంలో పునాదులు వేశారని.. ఇప్పుడు ప్రధాని మోదీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేపట్టాల న్నారు. భవిష్యత్తులో మనదేశం సూపర్ పవర్ కాబోతోందని చెప్పారు. మన దేశం, భారతీయత గురించి చర్చించేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదికన్నారు.

సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్ర అని చెప్పారు. యోగా ద్వారా భారతదేశం యూని వర్సల్ హెల్త్‌ను అందించిందన్నారు. జీరోను భారతీయులే కనిపెట్టారని గుర్తు చేశారు. చెస్ ఆట సైతం మనదేనని వివరిం చారు. భారతీయ కుటుంబ జీవితం మన దేశంలో మాత్రమే ఉందన్నారు. ఇది భద్రతతో పాటు జీవితాల్లో వెలుగునిస్తోందని పేర్కొన్నారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సౌర, పవన విద్యుత్తుపై అధికంగా దృష్టి పెడుతున్నామని వివరిం చారు. ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయడానికీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఏపీకి ఇప్పటికే గూగుల్ వచ్చిందని.. మైక్రోసాప్ట్ కూడా రావాలని చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలా అనేక అంతర్జాతీయ సంస్థలు ఆంధప్రదేశ్‌కు రాబోతు న్నాయని వివరించారు. ఇది దేశ అభ్యున్నతికి కూడా కారణమ వుతోందన్నారు. టెక్నాలజీలో మనం ప్రపంచంలో ఎవరికి తక్కువ కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటుచేసు కున్నాయి. మన దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమై న ప్రభుత్వం ఉంది. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. 2047 నాటికి ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంది. మన దేశం పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారు.
దశాబ్దకాలంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతుండగా.. భారత్‌లో మాత్రమే పెరుగుతోంది. తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ, విశాఖ లో మెడ్‌టెక్ పార్కు తీసుకొస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక వేతనాలను భారతీయులు పొందుతున్నారు. గతంలో హైదరా బాద్ లో ఐటీని ప్రోత్సహించా. దీనితో ప్రపంచంలో తెలుగు వారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారు. అమరావతిలో క్వాంట మ్ కంప్యూటింగ్‌ను ప్రోత్సహిస్తున్నా. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
