- ఫిర్యాదుల స్వీకరణకు క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేయాలి..
- 22ఏ భూ వివాదాలను పరిష్కరించి అవకాశాలు కల్పించాలని బాబు దిశానిర్దేశం..
ప్రభుత్వ పాలనలో వేగం పెంచేందుకు, అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో అభివృద్ధి ఆలస్యం కాకూడదని స్పష్టం చేసిన ఆయన, అవసరం లేని, పాతబడిపోయిన ‘బిజినెస్ రూల్స్’ను సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిబంధనలను సరళతరం చేయాలని నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అందించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. ఉన్నతాధికారులు సరైన నాయకత్వంతో పనిచేస్తేనే ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు చేరతాయని స్పష్టం చేశారు. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ పాలనలో పారదర్శకత తీసుకురావాలని సూచించారు. 2017తో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 20 శాతం వృద్ధి సాధించిందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలన్నారు
