- జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య
రైతులు తమ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు (అమ్మోరు లేదా బొబ్బ రోగం)తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్.వెంకటయ్య అన్నారు.సోమవారం చిలిపిచేడ్ మండల పరిధిలోని చిట్కూల్ గ్రామంలోని సర్పంచ్ తుపాకీ రాములు ఆధ్వర్యంలో పశువులకు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పశువు అనారోగ్యానికి గురైన వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు,జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్,ఎల్ఎస్ ఆకుల గట్టయ్య,యాదయ్య,గొర్రెల,మేకల పెంపకపుదారులు,రైతులు పాల్గొనడం జరిగింది.
