Friday, February 13, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మానవత్వాన్ని మృతదేహంతో పాటు పూడ్చిపెట్టాలా?

Aaj Ki Baath | మానవత్వాన్ని మృతదేహంతో పాటు పూడ్చిపెట్టాలా?

జగిత్యాల జిల్లా కందనకుంటలో కులరక్కసి మరోసారి మానవత్వాన్ని మట్టుపెట్టింది. ఎదల రాజేశం అంత్యక్రియలకు కుల బహిష్కృతుడు వచ్చాడనే సాకుతో గ్రామస్తులు పాడె మోయడానికి ముందుకు రాలేదు. కుల పెద్దల ఆగ్రహం భయంతో చావుకూ కులం కట్టేశారు.చివరికి మృతుడి భార్య, ఆడపడుచులే పాడె మోసారు. మురుమురాలు చల్లే పెద్దలు లేక, ఓ చిన్న బాలుడే..ఆ బాధ్యత చేపట్టాడు.. ఇది మన సమాజానికి నిగ్గుతేల్చే నిదర్శనం.రాకెట్ యుగంలో పరుగులు పెడుతున్న దేశం.. కానీ గ్రామాల్లో ఇంకా కుల అడ్డు గోడల కూల లేదాయె.. మానవత్వాన్ని మృతదేహంతో పాటు పూడ్చిపెట్టాలా? మనుషుల్లారా… మారండయ్యా..

  • మేదాజీ..
- Advertisement -
RELATED ARTICLES

Latest News