Friday, March 6, 2026
Homeకరీంనగర్Marijuana | గోదావరిఖనిలో గంజాయి స్వాధీనం

Marijuana | గోదావరిఖనిలో గంజాయి స్వాధీనం

ఆరుగురు నిందితుల అరెస్ట్

గోదావరిఖని, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని-1 టౌన్ పోలీసులు (Police) శనివారం గంజాయిని అక్రమ రవాణా (Illegal Transport) చేస్తున్న ఆరుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక కిలో 400 గ్రాముల గంజాయి, 6 సెల్ ఫోన్ల(Cell Phones)ను స్వాధీనం చేసుకున్నారు. కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న చిక్కుడు రాహుల్(23, కాకతీయ నగర్, గోదావరిఖని)ని ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి 900 గ్రాముల డ్రై గంజాయితో పట్టుకున్నారు. అతణ్ని విచారించగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బల్లార్షా(Ballarsha), మహారాష్ట్ర (Maharastra) నుంచి గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

రాహుల్ ఇచ్చిన సమాచారం మేరకు అతడితో పరిచయం పెంచుకొని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మిగతా ఐదుగురు (కొప్పుల సాయి ధనుష్, చిలుక వినీత్, మంచి కట్ల అక్షయ్, మాటూరి సాత్విక్, భూఖ్య రాజేష్) నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మరో 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ తెలిపారు. గంజాయి అమ్ముతున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్, క్రైమ్ పార్టీ సిబ్బంది రమేష్, శ్రీనివాస్, సదానందం, ప్రకాష్, రమేష్, మధుకర్, మధుసూదన్‌లను సీఐ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News