- బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న..
జనరల్ స్థానంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్ననన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ సర్పంచి అభ్యర్థి కర్రోళ్ల స్వప్న డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు ను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి కర్రోల్ల స్వప్న కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా, విద్యాధికురాలుగా నా హక్కుగా, దళిత మహిళగా జనరల్ స్థానంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.

పోటీ నుండి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ ఛైర్మెన్ ఎద్దుల కరుణశ్రీ, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ వైస్ చైర్మెన్ కర్రీస్వామి, పెద్దింటి వెంకటేష్, కె మాణిక్యం, సీనియర్ నాయకులు ఏం వేణు గోపాల్, గులాం ఖాదర్ ఖాన్, స్టార్ రహీమ్, నీలస్వామి, జోహెబ్ హుస్సేన్, సయ్యద్ జమీల్, హారీఫ్, మహేశ్వర్ రెడ్డి, ఖాదర్, అలీమ్ తదితరులు ఉన్నారు.
