Wednesday, April 1, 2026
Homeమహబూబ్‌నగర్‌BRS | ప్రలోభాలకు పాల్పడుతున్న బిఆర్ఎస్ నాయకులు.

BRS | ప్రలోభాలకు పాల్పడుతున్న బిఆర్ఎస్ నాయకులు.

  • చీరల పంపిణీకి బిఆర్ఎస్ నేతల యత్నం.
  • అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు.

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నానా రకాలుగా యత్నిస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్ గల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద బిఆర్ఎస్ నేతలు ఓటర్లకు చీరలు పంపిణి చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దీంతో బిఆర్ఎస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. బిఆర్ఎస్ నేత ఇంటి వద్ద దాదాపు 5 వేల చీరలు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని చీరలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే ఓటర్లకు చీరలు పంచేందుకు బిఆర్ఎస్ నాయకులు బరితెగించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News