- కాంగ్రెస్ గుండాల హేయమైన చర్య..
- ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ జైపాల్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి,తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ లో తన క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గుండాల దాడి హేయమైనా చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ జైపాల్ రెడ్డి,ఈ సందర్భంగా ఆయన శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ క్యాంపు కార్యాలయం పై దాడి కాంగ్రెస్ పిరికిపందల చర్యగా, క్యాంపు కార్యాలయంలో కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం సరైన చర్య కాదు అని జైపాల్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయినప్పటికి ప్రజలకు ఏ ఒక్క మంచి పనులు చేయకపోగా, కాంగ్రెస్ పైన రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం తిరేకం ఏర్పడింది ఎద్దేవా చేశారు. ఇటీవల గ్రామసభలు ఏర్పాటు చేస్తున్న గ్రామసభలలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారంటీ లేవని అధికారులను మరియు కాంగ్రెస్ నాయకులను నిలదీయడం జరుగుతుంది అని తెలిపారు.
కావాలని గజ్వేల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం పై దాడి చేసి, అక్కడ ఫర్నిచర్ ను అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది, ఒక తెలంగాణ తెచ్చిన కెసిఆర్ నియోజకవర్గంలో ఇలాగే ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు, ఇలాంటి సంస్కృతి తెలంగాణ లో గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులు తక్షణం స్పందించి ఇట్టి దాడికి పాల్గొన్న వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అమరం జైపాల్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.
