నిన్న మొన్నటి వరకు తేలిగ్గా శ్వాస తీసుకున్న మీరు ఉన్నట్టుండి ఇబ్బందిపడుతుంటే మీ ఊపిరితిత్తుల్లో(Lungs) ఏదో సమస్య(Problem) తలెత్తినట్లు అర్థంచేసుకోవాలి. ఆయాసం(Fatigue) అనిపిస్తే అలర్ట్(Alert) అవ్వాలి. ఈ తరహా ఇబ్బందులు రావటానికి పలు కారణాలు(Reasons) ఉన్నాయి. ముఖ్యంగా పొగ (Smoke) వల్ల శ్వాస మార్గాలు సంకోచిస్తాయి. దీంతో శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళితే వాపుకు దారితీస్తుంది. ఫలితంగా బ్రాంకైటిస్(Bronchitis) సమస్య వస్తుంది. కాబట్టి.. దుమ్మూ, ధూళి, పొగ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇంట్లోనూ గాలి కలుషితం(Pollute) కాకుండా జాగ్రత్తపడాలి. ధూమపానం చేయొద్దు. ఇతరులు చుట్టా, బీడీ, సిగరెట్(Cigarette) తాగుతున్నప్పుడు ఆ పొగ మన వైపు రాకుండా చూసుకోవాలి. వీలైతే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. శ్వాస తీసుకోవటాన్ని ఒక ఎక్సర్‌సైజ్(Exercise)లా చేయాలి. స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాలకు వెళ్లటం బెటర్. వాహనాలు రాకపోకలు సాగించే వైపు వెళ్లొద్దు. ఆరోగ్యం పట్ల అప్రమత్తత లేకపోతే సీఓపీడీ, దీర్ఘకాల బ్రాంకైటిస్, ఉబ్బసం వంటి రోగాల బారిన పడతామని గుర్తుంచుకోవాలి.
Breathing | శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిపడుతున్నారా?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
