- వార్షిక మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌కు ప్రచారం జోరు
- మహిళా దినోత్సవానికి అంకితంగా ప్రత్యేక నృత్య ప్రదర్శన
ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం విద్యార్థులు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్‌మెంట్ ఫెస్ట్ “బ్లిట్జ్‌క్రిగ్ 2కె26” కు ప్రచారం జోరందుకుంది. ఈ ఫెస్ట్ ఈ నెల 13,14 తేదీలలో నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహభరితమైన ఫ్లాష్‌మాబ్ ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆకట్టుకునే నృత్యాలతో సందడి చేస్తూ ఫెస్ట్‌కు సంబంధించిన సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ను పురస్కరించుకుని మహిళలకు అంకితంగా ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఫ్లాష్‌మాబ్ కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా సాగింది.కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు,సందర్శకులు తరలివచ్చి ఆసక్తిగా వీక్షించారు.విద్యార్థుల ఉత్సాహం,నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థులు రానున్న బ్లిట్జ్‌క్రిగ్ 2కె26 కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు.
