- పండిట్ డీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మరణలో బీజేపీ..
- తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పుణ్యతిథి కార్యక్రమం..
- ఆ మహానుభావుడి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి..
- బీజేపీ తెలంగాణ చీఫ్ ఎన్. రాంచందర్ రావు, తదితరుల నివాళులు..
నిరంతర అధ్యయనశీలి, కర్మయోగి, తత్వవేత్త.. ‘అంత్యోదయ’, ‘ఏకాత్మ మానవ దర్శనం’ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిథి సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. భారతీయ జనసంఘ్ స్థాపకుల్లో ఒకరుగా, మా పార్టీ సిద్ధాంత కర్తగా ఆయన చూపిన మార్గం మాకు దిక్సూచి వంటిది. భారతీయ జనసంఘ్ గా ప్రారంభమైన ఆ ఉద్యమం 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి, బుధవారం రోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం ఆయనలాంటి మహనీయుల త్యాగ ఫలితమే. పార్టీగా మనం ఈ విజయానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించేవారు. స్వయంగా తన పనులు చేసుకునే, కుర్తా-పైజామా ధరించి సాధారణంగా జీవించిన నాయకుడు. రాజకీయాలు అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం రాజకీయాల్లో ఉండాలని ఆయన తన జీవితంతో చూపించారు. ఈరోజు రాజకీయాల్లో కనిపిస్తున్న హంగామా, ఆర్భాటాల మధ్య ఆయన జీవితం ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన పాఠం.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవ దర్శనం’ భారతీయ జనతా పార్టీకి ప్రాణాధారం. భారతదేశ అభివృద్ధికి భారతీయ సంస్కృతి, స్వదేశీ భావనలతో ముడిపడిన ఆర్థిక విధానం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 1965లో విజయవాడలో నిర్వహించిన భారతీయ జనసంఘ మహాసభల్లో ఆయన ‘ఏకాత్మ మానవ దర్శనం’ను దేశానికి పరిచయం చేశారు.
ఈ సిద్ధాంతం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారిక తత్వంగా మారింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ స్ఫూర్తితో సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ అంత్యోదయ స్ఫూర్తికి నిదర్శనం. ఇంటిగ్రల్ హ్యూమనిజం ఆలోచనకు ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈ రోజు రాజకీయాల్లో విద్వేషాలు, అసభ్య భాష, కుట్రలు పెరుగుతున్నాయి. కానీ రాజకీయాలు సేవ కోసం ఉండాలి, సమాజ నిర్మాణం కోసం ఉండాలి అనే విలువలను ఉపాధ్యాయ గారు మనకు నేర్పించారు. అలాంటి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం దేశానికి అవసరం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మరణం అత్యంత విషాదకర పరిస్థితుల్లో జరిగింది. ఆయన మరణంపై పూర్తి సత్యం దేశానికి వెలుగులోకి రాకపోవడం ఇప్పటికీ బాధాకరం. అటువంటి మహనీయుడి నిరాడంబర జీవితం ప్రతి ఒక్కరికీ శాశ్వత ప్రేరణ.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒక్కటే – దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ‘అంత్యోదయ ఏకాత్మ మానవ దర్శనం’ మార్గంలోనే దేశాభివృద్ధి సాధ్యమన
