Wednesday, March 11, 2026
Homeవరంగల్‌Campaign | స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Campaign | స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

  • రాణా ప్రతాప్ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ…రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉంటూ గెలుపు కోసం గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. అధిక స్థానాల్లో గెలిచే విదంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి, ప్రవేశపెట్టిన పథకాల గురించి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెరుమాండ్ల కోటి, నాగిరెడ్డి రాజిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈర్ల నాగరాజు,గుగులోతు తిరుపతి,మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, సింగిరెడ్డి యాదగిరి, భూక్యా మైభూ, మండలం

- Advertisement -
RELATED ARTICLES

Latest News