పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా,మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ, టపాసులు పేల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ విజయమే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ అభివృద్ధి పథకాలు, అమిత్ షా వ్యూహరచన వల్లనే దేశవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరేందర్ చారి,మండల ప్రధాన కార్యదర్శి కరాటే మల్లేష్ ముదిరాజ్ కాళ్లకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరి మల్లేష్ ముదిరాజ్,మండల నాయకులు బీజేవైఎం నాయకులు కుమ్మరి నాగరాజు,ఎర్ర కృష్ణ,నర్సుగారి స్వామి, పరుమ్ నరేష్,చెట్టి శ్రీకాంత్,ఊట్ల నాగరాజు,నారం రాజు, రమేష్, కిరణ్ నత్తి బాలరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
