- భాదితుని ఫిర్యాదుతో సిసి కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.
ఇంటిముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేకగూడ గ్రామానికి చెందిన అఖిల్‌కు సంబంధించిన బైక్ శుక్రవారం రాత్రి రోజువారిలాగే ఇంటి ముందు పార్కింగ్ చేసి పడుకున్నాడు.ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.వెంటనే గ్రామంలో ఏర్పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు.ఎలాంటి ఫలితం లేకపోవడంతో అఖిల్ పోలీసులను ఆశ్రయించాడు.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి,సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
- Advertisement -
