- గ్రామ సర్పంచ్ చెక్కల పరమేష్
- నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ రుణపడి ఉంటా.
గ్రామానికి పెద్దగా కాకుండా గ్రామ సేవకుడిగా పనిచేస్తానని మీకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో మీ ముందుంటానని బిజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేష్ అన్నారు. బి జీ వెంకటాపూర్ నూతన సర్పంచ్ గా చెక్కల పరమేష్ సోమవారం రోజున ప్రమాణ స్వీకారం చేశారు. మాట్లాడుతూ బిజీ వెంకటాపూర్ గ్రామ ప్రజలు తన పై నమ్మకం తో గెలిపించారనీ తన పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన గ్రామ ప్రజలకు ఏళ్ల వేళలా అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరించి ఇంకా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బిజీ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్. అండ్ పేరెంట్స్ మీటింగ్ లో భాగంగా. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేసిన బొద్దు నాయక్ ఆహ్వానం మేరకు వెళ్లి. తదనంతరం పాఠశాలలో. విద్యార్థులు కూర్చోవడానికి ఇబ్బంది కరంగా ఉండడం గమనించి కుర్చీలు పాఠశాలకు 10 కుర్చీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారు.
