- తల్లి, పెద్దమ్మ ప్రైవేట్ ఫోటోలు ప్రియుడికి పంపిన దౌర్భాగ్యం..
- పోలీసులను ఆశ్రయించిన తల్లి దండ్రులు..
- యువతి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు..
ప్రేమ మోజో…ప్రియుడి మాయో కానీ, ఒక కూతురు నీచపు పనికి పాల్పడింది. కన్నతల్లి, పెద్దమ్మ ప్రైవేటు ఫొటోలను మొబైల్‌లో ప్రియుడికి పంపింది. ఈ ఘోరాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరు నగరానికి చెందిన ఓ యువతి(23)కి ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులు ఓ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. ఇటీవల కూతురు ఓ యువకుడితో సన్నిహితంగా ఉన్నట్టు తల్లి గమనించింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరని ప్రశ్నిస్తే….
కూతురు దాటవేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఫోన్ అన్‌లాక్ చేసి ఇవ్వాలని తల్లి కోరగా ససేమిరా అంది. తండ్రి విషయం తెలుసుకుని, కూతురును మందలించి, ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి దారుణ దృశ్యాలు కనిపించాయి. తల్లి, పెద్దమ్మకు సంబంధించిన ప్రైవేటు ఫొటోలను వాట్సా్‌పలో తన ప్రియుడికి కూతురు పంపినట్టు చూసిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. యువతి, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
