Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌BC | నవీన్ యాదవ్‌ను గెలిపించి బీసీల సత్తా చాటాలి

BC | నవీన్ యాదవ్‌ను గెలిపించి బీసీల సత్తా చాటాలి

ఓటర్లకు పిలుపునిచ్చిన బీసీ నేత లింగం గౌడ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bey Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌(Naveen Yadav)కి పార్టీలకు అతీతంగా ఓటేసి బీసీలు సత్తా చాటలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి (BC Welfare Association State Secretary) జాజుల లింగం గౌడ్ (jajula Lingam Goud) పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ విజయం సాధించేలా అందరూ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన ఓయు ఆర్ట్స్ కాలేజీ (OU Arts College) వద్ద మాట్లాడారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఐక్యంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలంతా ఇప్పుడు ఐక్యంగా ఉండి నవీన్ యాదవ్‌ను గెలిపించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వదని అన్నారు. గత పది సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్దఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీశైలం యాదవ్, బూర శ్రీనివాస్ గౌడ్, లింగం యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News