Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్BCB | ఐసీసీ నిబంధనలు ఆమోదయోగ్యం కావు

BCB | ఐసీసీ నిబంధనలు ఆమోదయోగ్యం కావు

అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్

టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)లో బంగ్లాదేశ్(Bangladesh) పాల్గొంటుందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ.. ఈ విషయమై ఐసీసీ విధించిన నిబంధనలు(ICC Rules) ఆమోదయోగ్యం కావని(Unacceptable) చెప్పింది. ఈ మేరకు ఆ దేశ యువజన, క్రీడల సలహాదారు అసిఫ్ నజ్రుల్ ప్రకటన మంగళవారం చేశారు. “ఇండియా క్రికెట్ బోర్డు(BCCI) ఒత్తిడికి తలొగ్గి, మాపై అసమంజసమైన షరతులు విధిస్తే మేం వాటిని అంగీకరించం. అయినా మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. మ్యాచ్‌ల వేదికలను మార్చిన ఉదంతాలు గతంలో అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో ఉన్నాయి. ఇదేమీ కొత్త కాదు. ఒకసారి ఇండియా పాకిస్తాన్‌(Pakistan)లో ఆడటానికి నిరాకరించినప్పుడు ఐసీసీ జోక్యం చేసుకొని వేదికను మార్చింది. ఆ రీతిలోనే మేం కూడా వేదిక మార్పు కోసం సహేతుకంగా కోరాం. కానీ.. ఆశించిన నిర్ణయం రాలేదు” అని అసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు. అంతకుముందు.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొంటారో లేదో చెప్పేందుకు బంగ్లాదేశ్‌కి ఐసీసీ డెడ్‌లైన్(Deadline)(జనవరి 21) పెట్టిందన్న వార్తలను ఆ దేశం తిరస్కరించింది. దీనిపై.. మీడియా కమిటీ చైర్మన్ అమ్జాద్ హొస్సేన్ స్పందించారు. బంగ్లాదేశ్‌కి నిర్దిష్ట తేదీ నిర్ణయించలేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News