తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతోంది. రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎమర్జెన్సీ సర్వీసులను బంద్ నుంచి మినహాయించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాలు బంద్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రజారవాణా నిలిచిపోయింది. రోడ్లపై జనసంచారం కరువైంది. దుకాణాలు, వ్యాపార సంస్థలు సైతం బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ తదితర జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది.
