Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌BCIF | 11న ‘పాలమూరు-సామాజిక న్యాయ సభ’

BCIF | 11న ‘పాలమూరు-సామాజిక న్యాయ సభ’

11-01-2026 ఉదయం 10 గంటలకు
వేదిక: క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, న్యూటౌన్, మహబూబ్‌నగర్
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో..
42% రిజర్వేషన్లు-9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం(Social Justice) ఎందుకు దూరమవుతోంది? బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు(BC Reservations) చట్టబద్ధంగా అమలుచేస్తామని ప్రకటించింది. కానీ ఈ హామీ నీటి మూట అని తేలిపోయింది. ఇరవై ఒక్క హామీలు ఇచ్చి, ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఘోరంగా మోసం చేసింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందే తెలిసి కూడా చెల్లని జీవోలు జారీ చేస్తూ బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తోంది. కేవలం బిల్లులు పాస్ చేసి “కేంద్రానికి పంపించాం” అని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. ఇది పూర్తి బాధ్యతా రాహిత్యం.

- Advertisement -

BC Intellectual Forum(BCIF) స్పష్టమైన డిమాండ్లు

  1. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. అన్ని రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయాలి.
  2. అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి 42% రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్పించాలి.
  3. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే న్యాయపరమైన, రాజకీయ పోరాటాన్ని ప్రారంభించాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇవ్వాలి.
  4. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని జాతీయ సమస్యగా తీసుకెళ్లి అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేయాలి.
  5. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర క్యాబినెట్‌ను తక్షణమే సమావేశపరచి బీసీ రిజర్వేషన్ల బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చడాన్ని ఆమోదించాలి. 2019లో వారం రోజుల్లోనే EWS రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. బీసీల అభ్యున్నతిని నిజంగా కోరుకుంటే.. బీసీల 42% రిజర్వేషన్ల బిల్లును కూడా తక్షణమే 9వ షెడ్యూల్‌లో చేర్పించాలి.
  6. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. ప్రేక్షక పాత్ర వహించడం మానేసి ఈ అంశాన్ని తక్షణమే టేకప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలి. లేనిపక్షంలో బీసీలే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి ఈ హక్కును సాధించుకుంటారు.

మూడు పార్టీలకు స్పష్టమైన హెచ్చరిక

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల పట్ల బాధ్యతగా నిలబడి 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి.

ఇది న్యాయమా?

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. (అది వారి రాజ్యాంగ పరమైన హక్కు) 10% కూడా లేని అగ్ర వర్ణాలకు 10% ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 61% జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికీ కేవలం 29% రింర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇది స్పష్టమైన సామాజిక అన్యాయం.

మా తుది డిమాండ్:

మేమెంతో.. మాకంత. 42% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసి, వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీలకు రాజ్యాంగ రక్షణతో కూడిన సామాజిక న్యాయం కల్పించాలి.

ముఖ్య అతిథులు:

గౌ|సి. చిరంజీవి గారు (రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ బిసిఐఎఫ్ ఫౌండర్ & చైర్మన్)
గౌ॥ జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ గారు (మాజీ ఎ.పి. హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టీస్)
గౌ॥ విశారదన్ మహారాజు గారు (బిసి, ఎస్సీ, ఎస్టీ ఆర్ఎం & డిఎఫ్సి, జెఎసి చైర్మన్)
గౌ॥ సంగెం సూర్యారావు గారు (బిసి సమాజ్ & బిసి టైమ్స్ రాష్ట్ర అధ్యక్షులు)

విశిష్ట అతిథులు:

గౌ॥ బెక్కెం జనార్ధన్ గారు (చైర్మన్ బిసి జాక్, మహబూబ్‌నగర్)
గౌ॥ కె.లక్ష్మణ్ గౌడ్ గారు (విశ్రాంత అధ్యాపకులు)
గౌ॥ఎస్. రమేష్ గౌడ్ గారు (BCIF రాష్ట్ర కోర్ సభ్యులు, (ప్రైవేట్ కాలేజీల సంఘం)
గౌ॥డాక్టర్. శివార్చక విజయ కుమార్ గారు (రిటైర్డ్ డీఈఓ)
గౌ॥జుర్రు నారాయణ యాదవ్ గారు (BCIF, నాయకులు)
గౌ॥ మోడాల శ్రీనివాస్ సాగర్ గారు (బిసి సమాజ్ అధ్యక్షులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా)
గౌ॥ నాగం కుమారస్వామి గారు (ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ)
గౌ॥ బి. లక్ష్మణ్ గారు (ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ప్రైవేట్ పాఠశాలల సంఘం)
గౌ॥ఎస్. వెంకటయ్య గారు (చైర్మన్, రుషి విద్యాసంస్థలు)
గౌ॥ సారంగి లక్ష్మికాంత్ గారు (రాష్ట్ర, కన్వీనర్ బిసి, ఎస్సీ, ఎస్టీ జాక్)
గౌ॥పచ్చిపాల సుబ్బయ్య గారు (పూలె ట్రస్టు అధ్యక్షులు).
గౌ॥ డా పెబ్బేటి మల్లికార్జున్ (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ)
గౌ॥ భూమయ్య గారు (అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ)
గౌ॥తాయప్ప గారు బిసి విద్యార్థి నాయకులు (పాలమూరు యూనివర్సిటీ)

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా

- Advertisement -
RELATED ARTICLES

Latest News