Homeరంగారెడ్డిAthletic | బాటసింగారం విద్యార్థి ప్రతిభ..

Athletic | బాటసింగారం విద్యార్థి ప్రతిభ..

  • తెలంగాణ మూడవ రాష్ట్రస్థాయి జంప్స్ అండ్ త్రోస్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక.

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మండారి ధనాంజనేయులు తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

ఈ నెల 10వ తేదీన హనుమకొండ జిల్లాలోని, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించబడుతున్న 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి జంప్స్ అండ్ త్రోస్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ధనాంజనేయులు పాల్గొననున్నాడు.

- Advertisement -
Batasingaram Student Selected For Telangana State Athletics Championship

ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ధనాంజనేయులు ఈ నెల 7వ తేదీన సరూర్‌నగర్ ఇండోర్ ప్రధాన అథ్లెటిక్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాలుర విభాగంలో జావెలిన్ త్రో ఈవెంట్‌కు ఎంపికయ్యాడు.
విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రదానోప్రాద్యయుడు దాసరి ప్రతాప్ తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో, ఎంఈఓ తదితరులు విద్యార్థి మండారి ధనాంజనేయులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News