టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఇండియా(India)లో ఆడే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్(Bangladesh) గురువారం స్పష్టం చేసింది. ఇండియాలో ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంక(Srilanka)కు మార్చాలన్న తమ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చడంతో(ICC Denied) ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్(Scotland) బరిలోకి దిగనుంది. టీమ్ ర్యాకింగ్స్ ప్రకారం తదుపరి అవకాశం స్కాట్లాండ్‌కే దక్కుతుంది. టీ20 వరల్డ్ కప్.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. తమ ఆటగాళ్లు, అభిమానులు, జర్నలిస్టుల భద్రత రీత్యా మ్యాచ్ వేదికలను ఇండియా నుంచి మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. కానీ.. ఐసీసీ ఒప్పుకోలేదు. మీరు ఆడతారో? లేక, వేరే టీమ్‌కి అవకాశం ఇస్తారో తేల్చిచెప్పాలని ఐసీసీ బంగ్లాదేశ్‌కి ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది. కానీ ఆ దేశం ఇవాల్టి వరకు సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఈరోజు బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ ప్రకటన చేశారు.
T20 World Cup | ఇండియాలో ఆడబోమన్న బంగ్లాదేశ్
- Advertisement -
RELATED ARTICLES
