ఈ రోజు ఉదయం 6 గంటలకు కన్నుమూసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని(Bangladesh Former PM), బీఎన్‌పీ అధ్యక్షురాలు(BNP President) ఖలీదా జియా(80) అంత్యక్రియలు రేపు బుధవారం జరగనున్నాయి. ఆమె చనిపోయిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం రేపు ఒక రోజు సెలవు దినం, మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్(Yunus) ప్రకటన చేశారు. బేగం ఖలీదా జియా 1981 నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party)కి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా ఉండటమే కాకుండా రెండు సార్లు ప్రధాని పదవిని చేపట్టారు. గత కొంత కాలంగా గుండె, మూత్రపిండాలు, మధుమేహం, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నెల రోజులుగా ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా 1991-96, 2001-06 మధ్య పదేళ్లు ప్రధానిగా చేశారు. అవినీతి కేసులో రెండేళ్లు(2018 నుంచి 2020 వరకు) జైలు జీవితం గడిపారు.
Khaleda Zia | ఖలీదా జియా అంత్యక్రియలు రేపు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

