- కితాబిచ్చింది కేటీఆర్..
- ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేత..
హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గపరిధిలోని ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేయూత అందించారు. 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు బీ.ఎల్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కులను బుధవారం నాడు లక్ష్మారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డిని కేటీఆర్ అభినందించారు. బీ.ఎల్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు చెక్కులు అందజేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
