- తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందించిన తెలంగాణ యువజన సంఘం.
మండల పరిధిలోని బీబీగూడెం సమీపంలో ఉన్న బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై పరిశ్రమను తక్షణమే మూసివేయాలని కోరుతూ తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు భాషిపంగు సునీల్, మండల అధ్యక్షుడు చెరుకు నగేష్ కలిసి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ తయారీ పరిశ్రమలోని ఫోమ్ ట్యాంక్ బలంగా పేలి, పేలుడు శక్తి కారణంగా పరికరాలు, ఇనుప ముక్కలు, రేకులు సుమారు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడి పరిసర ప్రాంతాల్లో పడ్డాయన్నారు.పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?
పరిశ్రమ నియమ నిబంధనలను పాటిస్తున్నదా? లేదా అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.ప్రజల నిత్యం ఆ పక్కనుండే మున్యా నాయక్ తండాకు వెళ్తుంటారని, సూర్యాపేట–ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే పరిశ్రమ ఉండటంతో ఇప్పుడు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్లక్ష్యపూరిత యాజమాన్యం కారణంగా కార్మికుల ప్రాణాలకే కాకుండా రహదారిపై ప్రయాణించే ప్రజల భద్రతకూ ముప్పు తయారైందని అన్నారు.
