Tuesday, March 3, 2026
Homeనల్లగొండComplaint | బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ కంపెనీ పై కలెక్టర్ కు ఫిర్యాదు.

Complaint | బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ కంపెనీ పై కలెక్టర్ కు ఫిర్యాదు.

చివ్వెంల మండలంలోని బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంపై లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్, సురేష్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మంగళవారం తెల్లవారుజామున 6 :40 గంటలకు సమయంలో బ్రిక్స్ కంపెనీలో ఉన్న పీడన ఫోమ్ ట్యాంక్ పేలుడు దాటికి ఒకసారి గా భయాందోళనకు గురయ్యామన్నారు. ఇదే బ్రిక్స్ కంపెనీలో మూన్య నాయక్ తండాకు చెందిన కూలీలు రోజు పని చేస్తుంటారని,ఆ సమయం లో కార్మికులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.

గ్రామాల మధ్య ప్రమాదకర ఫోమ్ బాయిలర్లు, పీడన ట్యాంకులు ఉండటం ప్రజల ప్రాణాలకు ముప్పు అని, ఇప్పటికే జరిగిన పేలుడు గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇలా కొనసాగితే పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని,ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిశ్రమను వెంటనే మూసివేయాలని జిల్లా కలెక్టర్‌కి పిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ముణ్యా నాయక్ తండాకు చెందిన భగవాన్ నాయక్, శివ నాయక్, రాములు నాయక్, నరేష్ నాయక్, లకపతి నాయక్, కోట నాయక్, రాజా నాయక్, అంబి నాయక్, సాలి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News