Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్ఈపీఎఫ్ఓలో ఆటోసెటిల్‌మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఈపీఎఫ్ఓలో ఆటోసెటిల్‌మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు శుభవార్త. అడ్వాన్స్ విత్‌డ్రాకు సంబంధించిన ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ఈ పరిమితి లక్ష రూపాయలు మాత్రమే కావటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. ఆటో సెటిల్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో తెచ్చింది. మానవ ప్రమేయం లేకుండా ఐటీ వ్యవస్థ సాయంతో క్లెయిమ్‌ను పరిష్కరించే వెసులుబాటునే ఆటో సెటిల్‌మెంట్ అంటారు. సభ్యుల కేవైసీ, బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయితే పేమెంట్ దానంతటదే ప్రాసెస్ అవుతుంది. దీంతో క్లెయిమ్ 3-4 రోజుల్లోనే సెటిల్ అవుతుంది. వైద్యం, చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం ఈ ఆటో సెటిల్‌మెంట్‌ను వాడుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News