Tuesday, February 10, 2026
Homeఆదిలాబాద్Asifabad Mla | ఇంటింటి ప్రచారంలో కోవ లక్ష్మి

Asifabad Mla | ఇంటింటి ప్రచారంలో కోవ లక్ష్మి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఆసిఫాబాద్ మండలం రాజంపేట (Rajampet) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) నేపథ్యంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి (Kova Lakshmi) ఇంటింటి ప్రచారం (Door to Door Canvas) నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్య, వార్డ్ మెంబర్స్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిశారు. BRS పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను(కల్యాణ లక్ష్మి, రైతు బంధు, తదితర పథకాలను) వివరించారు.

BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ‘మళ్లీ వచ్చేది BRS ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రజలకు భరోసా కల్పించారు. ​ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, BRS రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్, కోవ సాయినాథ్, కార్యకర్తలు/నాయకులు గంధం శ్రీను, నిస్సార్ భాయ్, అన్సార్ భాయ్, చిలువేరు వెంకన్న, సాజిద్, ఉమారాణి, లలిత, సుప్రజ, సంగీత తదితరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News