Wednesday, March 4, 2026
Homeఆదిలాబాద్ACC Season-2 | ముగింపు వేడుకల్లో పాల్గొన్న కోవ లక్ష్మి

ACC Season-2 | ముగింపు వేడుకల్లో పాల్గొన్న కోవ లక్ష్మి

ఆసిఫాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఆసిఫాబాద్ క్రికెట్ కప్(Asifabad Cricket Cup-ACC) సీజన్ 2 ముగింపు వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే(Asifabad Mla) కోవ లక్ష్మి(Kova Lakshmi) ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుకు, రన్నర్ జట్టుకు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అందజేశారు(Gifts Distribution). ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీస్తాయని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రికెట్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, BRS లీడర్ మర్సకోల సరస్వతి, నేతలు చిలువేరు వెంకన్న, నిస్సార్ భాయ్, ఇస్లాం భాయ్, దూడల అశోక్, పొన్నాల నారాయణ, జావీద్ భాయ్, అహ్మద్ భాయ్, సల్మాన్ ఖాన్, md.తాజ్, ch.రవి, సాజిద్, అన్సార్, హనుమండ్ల జగదీశ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News