నందిపేట్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు (development programs) ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) శంకుస్థాపన చేశారు. ఆంధ్ర నగర్ నుంచి ఇంద్రా నగర్ మీదుగా లక్నపూర్ వరకు రూ.2.28 కోట్లతో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. నందిపేట్-జన్నేపల్లి మెయిన్ రోడ్డు నుంచి చిమ్రాజ్‌పల్లి, లక్కంపల్లి మీదుగా తల్వేద వరకు రూ.6 కోట్ల 93 లక్షలతో చేపట్టే R&B డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
ఐలాపూర్ గ్రామంలో రూ.2 కోట్ల 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న SC బాలుర వసతిగృహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి(P.Sudarshan reddy), పీసీసీ చీఫ్(Pcc Chief), ఎమ్మెల్సీ (Mlc) మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), రాష్ట ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్, కలెక్టర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
