Thursday, January 22, 2026
EPAPER
Homeకెరీర్ న్యూస్AP Tet Results-2025 | ఏపీ టెట్‌ ఫలితాల విడుదల

AP Tet Results-2025 | ఏపీ టెట్‌ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Teachers Eligibility Test) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 2025 డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్‌కు 2 లక్షల 71 వేల 692 మంది అప్లై చేసుకోగా 2 లక్షల 48 వేల 427 మంది హాజరైనట్లు టెట్ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. ఈ పరీక్షకు సంబంధించి తొలుత ప్రిలిమినరీ కీ(Preliminary Key) విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరా(Objections)లను స్వీకరించి పరిశీలించిన అనంతరం తుది ఫలితాల(Final Result)ను రిలీజ్ చేసినట్లు కన్వీనర్‌ వెల్లడించారు. ఈ పరీక్షలో 97,560 మంది (39.27 శాతం) అభ్యర్థులు పాసయ్యారు. 31,886 మంది ఇన్‌ సర్వీస్ టీచర్లు(In Service Teachers) హాజరుకాగా 47.82 శాతం (15,239) మంది అర్హత సాధించారు. టెట్‌ రిజల్ట్‌ను tet2dsc.apcfss.inతోపాటు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో, 9552300009 వాట్సప్‌ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News