జాతీయ రోలర్ స్కేటింగ్(National Roller Skating)లో పతకాల(Medals) పంట పండించిన క్రీడాకారుల(Players)ను ఏపీ క్రీడా శాఖ మంత్రి(AP Sports Minister) మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) అభినందించారు. విశాఖ(Vishakapatnam) వేదికగా ఈ నెల 5 నుంచి 15 వరకు నిర్వహించిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజయవాడకు చెందిన అంచిత, దినేష్, దిరాజ్, తనుజ, తన్మయి పతకాలు సాధించడం ప్రశంసనీయమని చెప్పారు.
క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన కోచ్‌లు మహమ్మద్ ఖాజా, నాగుల్ మీరాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. పతకాల విజేతలు శుక్రవారం విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీసు(Minister Camp Office in Vijayawada)లో రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రోలర్ స్కేటింగ్ అండర్ 18, 15, 12 విభాగాల్లో 1 బంగారు, 4 కాంస్య, 5 రజత పతకాలు సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మహమ్మద్ ఖాజా, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
