Wednesday, April 1, 2026
Homeఆంధ్రప్రదేశ్AP High Court | భార్య ఆస్తిపై భర్తకు హక్కుండదు..

AP High Court | భార్య ఆస్తిపై భర్తకు హక్కుండదు..

  • ఏపీ హై కోర్టు ఒక సంచలన తీర్పు..
  • మరి భర్త ఆస్తిపై భార్యకు హక్కుంటుందా అంటున్న జనాలు..

హిందూ మహిళకు తల్లిదండ్రుల నుంచి లభించిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కులు ఉండవని ఏపీ హైకో ర్టు కీలక తీర్పు చెప్పింది. ఆమెకు పిల్ల లు పుట్టకపోతే, సదరు ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కులూ ఉండవని తేల్చి చె ప్పింది. ఆమె సంతానం లేకుండానే మ రణిస్తే, ఆ ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని వెల్లడించింది.

తన సోదరి శ్రీవిరిత మరణించినందున ఆమెకు నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి వ్యవహారంలో రెవెన్యూరి కార్డుల్లో తన పేరు నమోదు చేయాలని దేవిక మానస వేసిన అప్పీల్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ ఆర్డీవో ఇ చ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు పేర్కొన్నది. ఆర్డీవో ఉత్తర్వులను జేసీ రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. రికార్డుల్లో దేవిక మానస పేరు నమోదు చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News