ఏపీ సీఎం చంద్రబాబు.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’(Raitanna.. Meekosam) కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంకి మంత్రులు అచ్చెన్నాయుడు(Achennayudu), కందుల దుర్గేష్(Kandula Durgesh), ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. సీఎం.. పొలాలను పరిశీలించారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించారు.
కొబ్బరి ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి కొబ్బరి పంట దిగుబడి ఎంత మేర వస్తోందని ఆరా తీశారు. కోకో ఉత్పత్తులను కూడా పరిశీలించారు. నర్సరీలను అభివృద్ధి చేయాలని సూచించారు. వ్యవసాయం, హర్టికల్చర్‌లో వీలైనంత రీసెర్చ్, ఎనాలసిస్ చేపట్టాలని చెప్పారు. పామాయిల్ సాగులో టెక్నాలజీని వినియోగించేలా చూడాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు(Mla Maddipati Venkataraju)కు తెలిపారు.
