Tuesday, February 10, 2026
HomeఫోటోలుMovie Launch | ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ ప్రారంభం

Movie Launch | ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ ప్రారంభం

తెలుగు చిత్రసీమ(Telugu Film Industry)లోకి మరో మహిళా నిర్మాత (Lady Producer) అరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జి.శైలజారెడ్డి నిర్మాతగా, సీనియర్ డైరెక్టర్ శివాల ప్రభాకర్ దర్శకత్వంలో ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’ (Amma.. Naaku Aa Abbai Kaavali) సినిమా షూటింగ్ ప్రారంభమైంది (Cinema Shooting Start). ఈ మూవీ జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. యువ కిశోరం పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్నాడు. సుహాన, మేఘశ్రీ హీరోయిన్లు. సీనియర్ నటులు సుమన్(Suman), రావు రమేష్ (Rao Ramesh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి శైలజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు!!

ఈ కార్యక్రమం హైదరాబాద్ సారధి స్టూడియో(Saradhi Studios)లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.విజయేంద్రప్రసాద్ క్లాప్ కొట్టగా నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

- Advertisement -

ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శోభారాణి, ప్రముఖ రచయిత జె.కె.భారవి తదితరులు పాల్గొని నిర్మాతలను అభినందించారు. ఎల్.ఎన్.ఆర్, జి.సాయిపద్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ ధీరజ్, అప్పాజీ, ప్రొడక్షన్ మేనేజర్ బాలరాజు, కోడైరెక్టర్ రావుశ్రీ, సమర్పణ శ్రీ లక్షీశైలజ, నిర్మాత జి.శైలజారెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -దర్శకత్వం శివాల ప్రభాకర్.

- Advertisement -
RELATED ARTICLES

Latest News