Wednesday, May 13, 2026
Homeఆంధ్రప్రదేశ్AP | ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు..

AP | ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు..

  • సభ్యురాలిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ
  • జీవన్‌కుమారికి దక్కిన అవకాశం

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్న జీవన్‌కుమారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డులో ఆమెను సభ్యురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతను చాటింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ఐదుగురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో విశాఖపట్నం, తిరుపతి జిల్లాల కలెక్టర్లను వరుసగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రతినిధులుగా నియమించారు.

ఇక ట్రాన్స్‌జెండర్ల తరఫున ప్రతినిధులుగా గుంటూరుకు చెందిన జీవన్‌కుమారితో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన కోట ప్రేమ్‌సాగర్‌ రాయ్, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బోను దుర్గలకు చోటు కల్పించారు. ఈ బోర్డు రెండేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విధుల్లో ఉంటుంది. తన పీఏ జీవన్‌కుమారికి బోర్డులో స్థానం దక్కడం పట్ల ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. ఇది గుంటూరు జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

జీవన్‌కుమారికి ఉన్న సేవా దృక్పథం, సామాజిక చైతన్యం, ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై ఉన్న అవగాహన వల్లే ఈ పదవి వరించిందని ఆమె ప్రశంసించారు. ఈ నియామకంతో జీవన్‌కుమారి ట్రాన్స్‌జెండర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News