- బంగ్లా చొరబాట్లను ప్రోత్సహిస్తున్న మమత
- కంచె వేయకుండా మోకాలడ్డిన బెంగాల్ సీఎం
- భయం, అవినీతికి బెంగాల్‌ను కేరాఫ్‌గా మార్చారు
- ఘాటు విమర్శలు చేసిన కేంద్రహోంమంత్రి అమిత్ షా
- అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ..
భారత్ బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి మమతా సర్కార్ అడ్డం పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో భాజపా నిర్వహించిన విలేకరుల సమావేశం లో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనం కోసం టీఎంసీ పార్టీ బంగ్లాదేశీయుల చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్`బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేక పోతోందని ఆరోపించారు.
సరిహద్దుల్లో చొరబాట్లు కేవలం బెంగాల్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. మొత్తం దేశానికి సంబంధించిన సమస్యని అన్నారు. వీటివల్ల మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపానే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామని.. అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని హావిూ ఇచ్చారు. హింసాత్మక రాజకీయాలను సృష్టించడంలో వామపక్షాలను టీఎంసీ అధిగమించిందని అమిత్‌షా న్నారు.
మమత పాలనలో రాష్ట్రంలో హింస, అవినీతి రాజ్యమేలాయని..ఆమె అవినీతి వల్లే 15 ఏళ్లుగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిరదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు అంద కుండా టీఎంసీ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే భాజపాను గెలిపించాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే బెంగాల్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉద్యోగాలు కల్పిస్తామని..రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని హావిూ ఇచ్చారు.
అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
బెంగాల్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బెంగాల్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయని అమిత్ షా అన్నారని మమత పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఇక్కడ ఉంటే పహల్గాం, దిల్లీలో ఉగ్రదాడులు చేసింది ఎవరని ప్రశ్నించారు. బెంగాల్ ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే సరిహద్దుల్లో కంచె నిర్మించలేకపోతున్నామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మమత ఖండిరచారు.
పెట్రాపోల్, చంగ్రబంధ సరిహద్దుల్లో ఇప్పటికే తమ ప్రభుత్వం భూమిని ఇచ్చిందన్నారు. తాము స్థలాన్ని ఇవ్వడం వల్లే రాష్ట్రంలో అన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చాయన్నారు. భాజపా నేతలు చెప్పే అబద్ధపు మాటలను బెంగాల్ ప్రజలు నమ్మరన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కేంద్రం ’ఎస్‌ఐఆర్’ పేరుతో కుట్ర పన్నుతోందని వ్యాఖ్యానించారు. సర్ పక్రియను ఇంత హడావిడిగా చేయడం కుట్ర కాదా అని అన్నారు.
