Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంప్రయాగ్‌ రాజ్‌లో అమిత్‌షాకు ఘన స్వాగతం

ప్రయాగ్‌ రాజ్‌లో అమిత్‌షాకు ఘన స్వాగతం

  • స్వాగతం పలికిన సిఎం యోగి తదితరులు
  • కుంభమేళాలలో స్నానమాచరించిన అమిత్‌ షా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbh Mela) కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యోగా గురు బాబారామ్‌దేవ్‌ కూడా పుణ్యస్నానమాచరించారు. పుణ్యస్నానం కోసం ప్రత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న అమిత్‌ షాకు సిఎంయోగి ఆదిత్యనాథ్‌, ఆయన మంత్రిర్గ సహచరులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక బిజెపి నేతలు కూడా అమిత్‌ షాను స్వాగతించారు. మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో పోటెత్తున్నారు. ఈనెల 29న మౌని అమావాస్య కావడంతో 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు (అమృత స్నానం) ఆచరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించిందని అంచనా. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడికల్స్‌, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News