Saturday, March 7, 2026
Homeమెదక్‌Aksharabhyasam | అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా అక్షరాభ్యాసం

Aksharabhyasam | అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా అక్షరాభ్యాసం

  • చిన్నారులతో అక్షరాలు దిద్దించిన సర్పంచ్ బెస్త దుర్గాచలం

గ్రామీణ ప్రాంతాల్లోని 5ఏళ్ల లోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వాలు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సోమక్కపేట సర్పంచ్ బెస్త దుర్గాచలం పిలుపునిచ్చారు.శనివారం సోమక్కపేట గ్రామ పరిధిలోని గంగిరెద్దుల గూడ అంగన్‌వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన పిల్లలకి అక్షరాభ్యాసం,అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతన సర్పంచ్ బెస్త దుర్గాచలం హాజరై చిన్న పిల్లలకు అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం ప్రారంభించారు.

ఈ సందర్భంగా దుర్గాచలం మాట్లాడుతూ…

గ్రామంలోని తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని,చిన్నారులను ప్రైవేటు పాఠశాలకు పంపకుండా తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని,వారికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని వారు తెలిపారు.రాష్ట్ర శిశు సంక్షేమ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపుతున్న సందర్భంగా పిల్లలకు మంచి ఆహారం, దుస్తులు,ఆటవస్తువులు కల్పిస్తున్నందున తల్లిదండ్రులు అది గమనించి ప్రైవేట్ బడుల్లో పిల్లలను చేర్పించకుండా అంగన్‌వాడీ కేంద్రానికే పంపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గాచలం ఉప సర్పంచ్ నరేష్ అంగన్వాడీ టీచర్ ప్రసన్న వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News