Sunday, February 15, 2026
Homeహైదరాబాద్‌AI MahaShivratri | ప్రపంచంలోనే తొలి “AI మహాశివరాత్రి”

AI MahaShivratri | ప్రపంచంలోనే తొలి “AI మహాశివరాత్రి”

  • 50 నిమిషాల్లో 5,700+ తెలుగు శివ భక్తి గీతాలు సృష్టించిన 500+ గ్లోబల్ భక్తులు

సాంకేతికత మరియు ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ఘట్టంగా ప్రపంచంలోనే తొలి “AI మహాశివరాత్రి – డిజిటల్ నాద యజ్ఞం” విజయవంతంగా నిర్వహించబడింది. హైదరాబాద్‌కు చెందిన SUPER AI Academy ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా భక్తులు పాల్గొని కేవలం 50 నిమిషాల్లో 5,700కుపైగా తెలుగు శివ భక్తి గీతాలను సృష్టించారు.

ఈ మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఈ డిజిటల్ నాదయజ్ఞం Zoom వెబినార్ వేదికగా జరిగింది. పాల్గొన్న భక్తులు ChatGPT Custom GPT సహాయంతో శివునిపై సాహిత్యం రూపొందించగా, AI ఆధారిత సంగీత సాధనాలతో భక్తి గీతాలను స్వరపరిచారు. ఈ కార్యక్రమం వాణిజ్య లక్ష్యాలతో కాకుండా, భక్తి సమర్పణగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

శివుడు, రుద్రుడు, నటరాజ, అర్ధనారీశ్వర, లింగోద్భవం, శివతాండవం వంటి మహాదేవుని విభిన్న రూపాలపై గీతాలు సృష్టించబడినట్లు వెల్లడించారు. విశేషంగా, సృష్టించిన అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేవలం 50 నిమిషాల వ్యవధిలో నియమిత మార్గదర్శకాలతో, సమన్వయంతో ఈ కార్యక్రమం సాగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఒకే సమయానికి AI సాంకేతికతను వినియోగించి గీతాలను సృష్టించడం విశేషం.

ఈ కార్యక్రమం కొనసాగింపుగా 5,700కుపైగా గీతాలలో 108 గీతాలను ఎంపిక చేసి ఈరోజు రాత్రి 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు SUPER AI కమ్యూనిటీ సభ్యుల కోసం డిజిటల్ జాగరణ ప్రత్యేక Zoom ప్రసారంగా వినిపించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనిని డిజిటల్ నాదార్పణగా భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వరరావు . Impact International Treasurer గంపా ఆదిత్య భరత్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయశ్రీ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఆలోచనకు రూపకల్పన చేసిన SUPER AI Academy వ్యవస్థాపకుడు నికీలూ గుండా మాట్లాడుతూ, “AI సాంకేతికతను సమాజానికి, సంస్కృతికి ఉపయోగపడేలా మార్చడం మా లక్ష్యం. భక్తి మరియు టెక్నాలజీ కలిసి పనిచేయగలవని ఈ కార్యక్రమం నిరూపించింది,” అని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

AIMahashivaratri.com వెబ్‌సైట్ ద్వారా ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్థాయిలో నమోదు మరియు సమన్వయం నిర్వహించబడింది.

SUPER AI Academy ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ గ్యాప్ తగ్గించి, తెలుగులోనే AI సాధనాలను అందుబాటులోకి తీసుకురావడం సంస్థ ప్రధాన దృష్టి అని నిర్వాహకులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వేలాది గీతాలు ఒకే వేదికపై సృష్టించబడటం ద్వారా “AI మహాశివరాత్రి 2026” సాంకేతికత మరియు ఆధ్యాత్మికత కలయికలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News