గచ్చిబౌలి(Gachibowli)లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ESCI-ఎస్కీ) నార్త్ గేట్ దగ్గర విద్యుత్ వాహనాల(EV) ఛార్జింగ్ స్టేషన్ (Charging Station) ఏర్పాటు చేయనున్నట్లు కాలేజీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్‌రావు తెలిపారు. స్టేషన్ ఏర్పాటుకు రిలయన్స్ జియో మొబిలిటీ(Reliance Jio Mobility)తో గురువారం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. కార్లకు సంబంధించిన పాయింట్లు 30, బస్సులకు ఒక పాయింట్ ఉంటాయని పేర్కొన్నారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎస్కీ-రిలయన్స్ బీపీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పేరుతొ ఈ ఔట్‌లెట్ (Outlet) ఏర్పాటుచేస్తున్నట్లు రామేశ్వర్‌రావు వివరించారు. ఈ సమావేశంలో కాలేజ్ చీఫ్ ఎస్.లక్ష్మీకాంతరావు, డిప్యూటీ చీఫ్ డాక్టర్ పి.రాజారావు, రిలయన్స్ కంపెనీ సదరన్ రీజనల్ మేనేజర్ నవీన్, సీనియర్ మేనేజర్ సిద్ధార్థ పాల్గొన్నారు.
ESCI | ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఒప్పందం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
