Wednesday, February 11, 2026
Homeక్రైమ్ వార్తలుACB | ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB | ఏసీబీకి చిక్కిన ఏఈ

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో నిత్యం ఏదో ఒక చోట ప్రభుత్వాధికారులు అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau-ACB)కి పట్టుబడుతున్నారు. లంచం (Bribe) డిమాండ్ చేసి అందులో ఎంతో కొంత తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌(Red Handed)గా దొరికిపోతున్నారు. ఈ ఘటనలను బట్టి చూస్తుంటే ప్రభుత్వ విభాగాల్లో ప్రజలకు పనులు కావాలంటే కచ్చితంగా లంచం ఇవ్వాల్సిందేనా అనే అభిప్రాయం నెలకొంటోంది. తాజాగా వనపర్తి జిల్లా గోపాలపేట మండలం విద్యుత్ శాఖ అధికారి (AE) ఎన్.హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ (Current Transformer) విషయంలో రూ.40 వేలు లంచం డిమాండ్ చేసి రూ.20 వేలు తీసుకుంటూ బుక్ అయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News