Saturday, March 7, 2026
Homeహైదరాబాద్‌Adulteration | లాలాగూడలో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు

Adulteration | లాలాగూడలో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు

  • టాస్క్ ఫోర్స్ దాడి: అపరిశుభ్ర గోడౌన్‌లో 1915 కేజీల కల్తీ పేస్ట్ స్వాధీనం
  • నకిలీ బ్రాండ్ లేబుల్స్‌తో కిరాణా దుకాణాలకు సరఫరా – నలుగురు అరెస్ట్
  • అక్రమ తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి

సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం,లాలాగూడ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.విశ్వసనీయ సమాచారం మేరకు లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ‘ఝాన్సీ’అల్లం-వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై దాడి చేయగా,అపరిశుభ్రమైన పరిస్థితుల్లో కల్తీ పదార్థాలతో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు నీల వెంకటేశ్వర్లు సూపర్‌వైజర్ వినోద్ మరియు ఇతర వర్కర్ల సహకారంతో లాలాపేటలో ఈ గోడౌన్‌ను నిర్వహిస్తున్నాడు.అల్లం-వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసి,నకిలీ బ్రాండ్ లేబుల్స్ అతికించి ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ విధంగా అక్రమంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నట్టు గుర్తించారు.దాడిలో భాగంగా పోలీసులు 1915 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వివిధ పరిమాణాల బాక్సులు మరియు 18 ప్లాస్టిక్ టబ్బులలో స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 30 కిలోల ఎసిటిక్ యాసిడ్, సుమారు 10 కిలోల క్సాంతమ్ గమ్, ఒక గ్రైండర్/మిక్సింగ్ మెషిన్,ఒక వెయింగ్ మెషిన్,రెండు ప్యాకింగ్ మెషీన్లు,80 కిలోల ముడి అల్లం-వెల్లుల్లి, నాలుగు డేట్ స్టాంపులు,ఝాన్సీ-ఎం,పేరుతో ఉన్న 86 లేబుల్స్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా నీల వెంకటేశ్వర్లు (56),కె.వినోద్ (46),టి.సతీష్ (23),ఎం.శివాని (46)లను అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో Cr.No.84/2026 కింద BNS సెక్షన్లు 318(4),275,223,r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.ఈ దాడిలో సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె.రాజశేఖర్,లాలాగూడ ఇన్‌స్పెక్టర్ టి.అశోక్ కుమార్,ఎస్‌.ఐలు ఎస్.రాజు,రాజేశ్వర్ రెడ్డి వారి బృందం విజయవంతంగా నిర్వహించారని హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అందె శ్రీనివాసరావు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News