- లాలాగూడ పోలీస్ స్టేషన్ దూరం అడ్డగుట్ట ప్రజలకు భారం – అడ్డగుట్ట అఖిలపక్ష నేతల ఆందోళన
- సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు వినతిపత్రం అందజేత
తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో అధిక భాగమైన ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలనే ప్రతిపాదనల వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అడ్డగుట్ట అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలను లాలాగూడ పరిధిలోకి మార్చడం వల్ల ఫిర్యాదులు నమోదు చేయడం,పోలీస్ సేవలు పొందడం వంటి అంశాల్లో ప్రజలు ఇబ్బందులు పడతారని నేతలు తెలిపారు.అందువల్ల ఈ ప్రతిపాదనలను వెంటనే రద్దు చేసి,యథాతథంగా ప్రస్తుత పోలీస్ స్టేషన్ పరిధినే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రం కార్యక్రమంలో అడ్డగుట్ట డివిజన్ అఖిలపక్ష నేతలు ఎస్.యాదగిరి,నక్క మధు,ఆర్.మల్లేష్,నర్సింగ్ రావు,మనోహర్,హంసరాజు,చందర్,శ్రీధర్ గౌడ్,శ్రీరామ్ నాయక్,తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేకు వివరించారు.ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,ఈ అంశంపై త్వరలోనే సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
