Thursday, February 12, 2026
Homeబిజినెస్Adani | ఎయిర్‌పోర్టుల్లో లక్ష కోట్ల పెట్టుబడులు

Adani | ఎయిర్‌పోర్టుల్లో లక్ష కోట్ల పెట్టుబడులు

గౌతమ్ అదానీ గ్రూపు(Goutam Adani Group).. వచ్చే ఐదేళ్లలో ఎయిర్‌పోర్టుల బిజినెస్‌(Airports Business)లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ప్రైవేటీకరణకు సంబంధించిన తదుపరి దశలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ప్రణాళికలు రచిస్తోంది. మన దేశ వైమానిక రంగం ఏటా 15 నుంచి 16 శాతం విస్తరిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను అదానీ చిన్న కుమారుడు(Younger Son Of Gautam Adani), అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్(Adani Airports Director) జీత్ అదానీ(Jeet Adani) వెల్లడించారు.

నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలు ఈ నెల 25న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో జరిగిన ప్రైవేటైజేషన్ రౌండ్‌లో అదానీ సంస్థ ఆరు విమానాశ్రయాలను సొంతం చేసుకుంది. అవి.. అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరు. 2021లో జీవీకే గ్రూప్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌ను చేజిక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News