బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు సంబంధించి
7 చోట్ల సోదాలు
- అవినీతి అనకొండ కొంతం శ్రీనివాసులు అరెస్ట్
- ఏసీబీ అదుపులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ
- అతని అక్రమాల సామ్రాజ్యంపై ఎట్టకేలకు ఉక్కుపాదం
- అధికారాన్ని అడ్డంపెట్టుకొని వక్రమార్గంలో అవినీతి..
- అక్షర సత్యమైన ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు
రూ.100 కోట్లు కూడబెట్టిన భూ సర్వే & భూ సంస్కరణల రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు.. సోదాల్లో భారీగా బయటపడిన ఆస్తులు.. మై హోం భూజాలో ఫ్లాట్.. నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ / రైస్ మిల్.. శ్రీనివాసులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు..

కొంతం శ్రీనివాసులు పాపం పండిరది. ప్రభుత్వ అధికారిగా తీసుకునే లక్షల వేతనం చాలక డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏదైనా చేయటానికి వెనకాడని అతనికి తగిన శాస్తి జరిగింది. అడ్డగోలు సంపాదనకు అలవాటుపడ్డ రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. ఉన్న భూమి లేనట్టు, లేని భూమి ఉన్నట్టు తనకు ఇష్టం వచ్చినట్లు రికార్డులను తారుమారు చేస్తూ ఎంతో మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేసిన కొంతం శ్రీనివాసులు ఎట్టకేలకు కటకటాలపాలు అవుతున్నాడు. అధికారాన్ని స్వార్థానికి వాడుకొని చట్టాలతో చెలగాటమాడిని అతడిపై ప్రభుత్వం ఇప్ప టికైనా చర్యలకు ఉపక్రమించటం బాధితులకు ఊరట కలిగి స్తోంది.

కొంతం శ్రీనివాసులుపై ఆలస్యంగానైనా ఉక్కు పాదం మోపటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవి నీతికి కేరాఫ్ అడ్రస్ అయిన అతనిపై పూర్తి స్థాయిలో విచారణ జర పాలని ప్రజలు కోరుతు న్నారు. లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప అతని వెనక ఉన్న గద్దల్లాంటి పెద్దలెవరో తేలదని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కొంతం శ్రీని వాసులు అవినీతి, అక్రమాల సామ్రాజ్యంపై ఎట్టకేలకు గవర్న మెంట్ ఫోకస్ పెట్టింది. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక గత కొంత కాలంగా పూర్తి ఆధారాలతో ప్రచురించిన వరుస కథనాలకు బలం చేకూరింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం శ్రీనివాసులు ఇల్లు, ఆఫీసు, ఇతర బినామీ ఆస్తులపై ఆకస్మిక దాడులు చేపట్టడం శుభపరిణామమని చెప్పొచ్చు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ దాడుల్లో కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు ధారాదత్తం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద భారీగా ఆస్తులు పోగేసుకున్న శ్రీనివాసులు బాగోతంపై ఆదాబ్ హైదరా బాద్ ప్రచురించిన ప్రతి అక్షరం నిజమని నిరూపణ అయింది.
అసిస్టెంట్ డైరెక్టర్ కొంతం శ్రీనివాసులు అవినీతి, అక్రమాస్తులపై ఆదాబ్ హైదరాబాద్ పత్రిక గతంలోనే స్పష్టంగా హెచ్చరించింది. నల్గొండ జిల్లా కలెక్టర్ సరెండర్ చేసిన నివేదిక, అందులో తీవ్ర ఆరో పణలు (ప్రభుత్వ భూముల తారుమారు, డీఎస్పీ మృతికి కారణం వంటివి) ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు ఆయనను ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. విచారణకు బదులు కీలకమైన రంగారెడ్డి పోస్టింగ్ ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
ఉన్నతాధికారుల అండదండలతో, వారి నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన శ్రీనివాసులు తన అవినీతిని మరింతగా పెంచేసుకున్నారు. నల్గొండలో జరిగిన అక్రమాలను విచారిం చకుండా వదిలేయడం వల్లే రంగారెడ్డిలో ఏకంగా రూ.70 కోట్లకు పైగా అక్రమాస్తులు పోగుచేసుకునేందుకు అవకాశం దక్కింది. ఒక పత్రిక పదేపదే హెచ్చరించినా, ఒక జిల్లా కలెక్టర్ అధికారికంగా నివేదిక ఇచ్చినా పట్టించుకోని ఉన్నతాధికారుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఆలస్యమైనా న్యాయం గెలిచింది!
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచును అన్నట్లు.. కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టి, ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థను శాసించాలని భావించిన కొంతం శ్రీనివాసులు ఆట ఎట్టకేలకు కట్టయింది. ఏది ఏమైనా ఆలస్యంగానైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి, అత్యంత అవినీతిపరుడైన ఈ అధికారి భరతం పట్టడం పట్ల బాధితులు, ప్రజలు, అన్నివర్గాల వాళ్లు సంతోషం వెలిబుచ్చుతున్నారు.

పౌర సమాజం డిమాండ్లు:
కేవలం బదిలీలతో సరిపెట్టకుండా అవినీతి నిరోధక చట్టంతో పాటు బినామీ లావాదేవీల (నిషేధ) చట్టం-1988 కింద కూడా కొంతం శ్రీనివాసులుపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం కోరుతోంది. గచ్చిబౌలిలోని రూ.20 కోట్ల ఫ్లాట్, నారా యణపేటలోని రూ.50 కోట్ల రైస్ మిల్లు భూమి, మహబూబ్ నగర్‌లోని భవనం వంటి అన్ని అక్రమ ఆస్తులను తక్షణమే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తోంది. శ్రీనివాసులుకు అండగా నిలిచిన, కీలక పోస్టింగ్ ఇచ్చేందుకు సహకరించిన ఉన్నతాధికారులపై కూడా సమగ్ర విచారణ జరిపి, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ప్రజల సొమ్ముతో కోట్లకు పడగలెత్తిన అక్రమార్కుడిని చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ దాడులు ఇతర అవినీతిపరులకు ఒక గుణపాఠం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
