Tuesday, February 10, 2026
Homeసాహిత్యంHarathi | హారతులు.. రకాలు..

Harathi | హారతులు.. రకాలు..

సర్వేశ్వరుడికి వేదమంత్రాలతో సశాస్త్రీత్రయంగా ఇచ్చే సర్వ మంగళ నీరాజనమే హారతి. ఇందులో పలు రకాలు ఉన్నాయి. అవి..

  1. ఏక హారతి: ప్రతిదీ ఒకే విధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.
  2. నేత్ర హారతి: దివ్య స్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్ర హారతి. దీనివల్ల సమస్త దృష్టి లోపాలు తొలిగిపోతాయి.
  3. బిల్వ హారతి: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.
  4. పంచ హారతి: ఇది పంచ భూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచ భూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా సమస్త మానవాళి బాగుండాలని ఇచ్చే హారతి.
  5. సింహ హారతి: ఇది ప్రతిఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.
  6. రుద్ర హారతి: రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.
  7. చక్ర హారతి: చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైందిగా భావిస్తారు.
  8. నవగ్రహ హారతి: మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.
  9. కుంభ హారతి: ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతోపాటు సమస్త దిష్టి దోషాలు తొలిగిపోవడానికి ఈ హారతి పడతారు.
  10. నృత్య హారతి: పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్య హారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.
  11. రథ హారతి: ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథ హారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథ హారతి.
  12. వృక్ష హారతి: సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్ష హారతి.
  13. నాగ హారతి: సంతాన లోపాలు, కాలసర్ప దోషాలు తొలిగిపోవడానికి ఇచ్చేదే నాగ హారతి.
  14. ధూప హారతి: భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూప హారతి.
  15. అఖండ కర్పూర హారతి: సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి.
  16. నక్షత్ర హారతి: ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలిగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి
  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News