ఓ పాలకులారా, మీ చెవులు తెరవండి.. ప్రజల గుండె గీతం ఆలకించండి! నిరుపేద కుటుంబం కలలు కన్నది.. నాణ్యమైన విద్య, వైద్యం కోరినది! పాఠశాలలు కావాలి, జ్ఞాన దీపాలు.. ఆసుపత్రులు కావాలి, ఆరోగ్య గీతాలు.. గారడి మాటలతో కాలం వృథా చేయకండి.. పిల్లల భవిష్యత్తును ఆటవస్తువు చేయకండి! ఉచితాలను వాగ్దానం చేసి మోసం చేయకు.. పనికిరాని వాగ్దానాలతో ఆశలు రేయకు.. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించు.. ప్రతి గుండెకు వైద్యం చేరువ చేయించు! ఒక పిల్లవాడి కల ఒక నక్షత్రమై.. ఒక రోగి ఆశ జీవన గీతమై.. సమాజం సౌరభం సుగంధమై పరిమళించాలి.. భవిష్యత్తు బంగారు కాంతులతో వెలిగాలి! ఓ పాలకులారా, ఇది ప్రజల ఆకాంక్ష.. విద్య, వైద్యం కావాలి నాణ్యమైన శక్తి! ఇకనైనా మేల్కొని, హామీలు నెరవేర్చండి.. ప్రజల హృదయాల్లో ఆశల దీపం వెలిగించండి!
- సారం జితేందర్