ఆర్థిక(economic), సామాజిక(social), రాజకీయ (political) అసమానతల్లో (inequalities) చిక్కుకున్న జనం.. కరిగిపోతున్న పేద, మధ్యతరగతి ఆదాయాలు.. అప్పుల్లో (Debts) కూరుకుపోయి దుర్భర జీవితం గడుపుతున్న ప్రజలు.. రైతాంగాన్ని వెంటాడుతున్న ఆత్మహత్యలు, నైపుణ్యం కోల్పోయిన నాసిరకం విద్యా విధానం (Education).. ఉపాధి, ఉద్యోగాల లేమితో నీరసించిన యువత.. అసమానతలు పెరుగుతూనే, కుబేరుల వద్ద పోగవుతున్న జాతి సంపద. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ధనవంతులే పైచేయి సాధిస్తున్న పరిస్థితి.. వాగ్దానాలు, వాగ్ద్బాణాలు పక్కనపెట్టి విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, అన్నదాతలకు తగిన మద్దతు ధర, ఉపాధి-ఉద్యోగ అవకాశాలతో యువతకు చేయూతనిస్తేనే సమిష్టి పురోభివృద్ధి
సాధ్యమవుతుంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి (Democracy) సార్ధకత.
Aaj Ki Baat | అప్పుడే ప్రజాస్వామ్యానికి సార్ధకత
- Advertisement -
RELATED ARTICLES
